పెళ్లి పై మనసైనది అంటున్న బోల్డ్ హీరోయిన్ !

Kangana

బాలీవుడ్‌ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌ నటిస్తున్నతాజా చిత్రం ‘పంగా’. బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆమె ఒకప్పటి మహిళా కబడ్డీ చాంపియన్‌ జయ నిగమ్ పాత్రను చేస్తోంది. తాజాగా కంగనా రనౌత్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. తన పెళ్లి గురించి మనసులో మాటను బయటపెట్టింది. ఆమె మాట్లాడుతూ.. ‘తొలుత పెళ్లంటేనే వద్దు అనుకున్నాను. కానీ ఇప్పుడు నా అభిప్రాయం మారిపోయింది. దీనికి కారణం పంగా దర్శకురాలు అశ్విని అయ్యర్‌, ఆమె భర్త నితేశ్‌ తివారి . వీళ్లిద్దరి మధ్య అన్యోన్యత, ప్రేమను చూసిన తర్వాత పెళ్లిపై నాకున్న చెడు అభిప్రాయం పూర్తిగా చెరిగిపోయింది. అందుకే నేను త్వరలో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అన్నారు.

పంగా చిత్ర ట్రైలర్ ఇటీవల విడుదలైన మంచి ఆదరణ దక్కించుకొంది. పెళ్ళైన మహిళగా కబడ్డీ క్రీడాకారిణిగా రెండు భిన్న పాత్రలలో కంగనా నటించి మెప్పించారు. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారిన కంగనా రనౌత్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న జయలలిత బయోపిక్ తలైవి చిత్రంలో నటిస్తున్నారు. అలాగే ధాకడ్ అనే ఓ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు.

Exit mobile version