నైజాంలో “కంగువ” ను రిలీజ్ చేయనున్న ప్రముఖ నిర్మాణ సంస్థ!

నైజాంలో “కంగువ” ను రిలీజ్ చేయనున్న ప్రముఖ నిర్మాణ సంస్థ!

Published on Jul 4, 2024 7:00 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో, డైరెక్టర్ శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కంగువ. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్, KVN ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ బ్యానర్ల పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, స్టార్ హీరోయిన్ దిశా పటానిలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అక్టోబర్ 10, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ చిత్రం యొక్క నైజాం ఏరియా థియేట్రికల్ బిజినెస్ పూర్తి అయ్యింది. ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పి వారు నైజాంలో కంగవ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు. ఇదే విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించడం జరిగింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు