ఎట్టకేలకు ఆమెకు కరోనా నుండి విముక్తి..!

Published on Apr 6, 2020 10:38 am IST

బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కరోనా వైరస్ పాజిటివ్ గా తేలిన సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం లండన్ నుండి వచ్చిన ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని వచ్చింది. దీనితో ఆమెను లక్నో నందు గల సంజయ్ గాంధీ ఇన్స్టిట్యూట్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి ఉంచి వైద్యం అందిస్తున్నారు. చాల రోజులుగా చికిత్స పొందుతున్న కనికా కపూర్ కి నాలుగు సార్లు టెస్ట్స్ నిర్వహించినా పాజిటివ్ అని వచ్చింది. తాజాగా నిర్వహించిన వైద్య పరీక్షలలో ఆమె కోవిడ్ 19 నెగెటివ్ అని వచ్చిందని సమాచారం.

కాగా 6వ సారి కరోనా టెస్ట్ నిర్వహించిన వైద్యులు ఆమె కరోనా వైరస్ నుండి పూర్తిగా కోలుకున్నట్లు నిర్ధారించారు. దీనితో ఆమెను నేడు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసినట్లు తెలుస్తుంది. ఐతే ఆమె కొన్నిరోజులు ఇంటి సభ్యులకు దూరంగా ఉండడంతో పాటు, తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా డాక్టర్స్ సూచించినట్లు తెలుస్తుంది. దాదాపు రెండు వారాలకుపైగా చికిత్స పొందుతున్న కనికా కపూర్ అంత్యంత మనోవేదన అనుభవించారు. ఆమె ఇంటిని, పిల్లలను మిస్సవుతున్నట్లు బాధపడ్డారు.

సంబంధిత సమాచారం :

X
More