బాల‌కృష్ణతో ఢీ కొట్టనున్న కన్నడ హీరో..!

Published on Nov 7, 2021 2:22 am IST


నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బిజీ బిజీగా ఉన్నాడు. ఓవైపు వ‌రుస సినిమాలు ఒప్పుకుంటూనే.. ఆహా ఓటీటీలో “అన్ స్టాపబుల్” అనే టాక్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరక్కించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “అఖండ” సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమా త‌ర్వాత గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో బాల‌య్య ఓ సినిమాకు చేస్తున్నాడు.

అయితే ఇప్ప‌టికే స్క్రిప్టు ప‌నులు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. కాగా ఈ సినిమాలో విలన్‌గా కన్నడ స్టార్ ధునియా విజ‌య్‌ని తీసుకోవాలని గోపీచంద్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. క‌న్న‌డ‌లో ప‌లు సినిమాల్లో నటించి, ధునియా సినిమాతో విప‌రీత‌మైన క్రేజ్ తెచ్చుకున్నాడు ధునియా విజ‌య్. మరీ బాలయ్య లాంటి ప‌వ‌ర్‌ఫుల్ మేన్‌కి ధునియా విజ‌య్‌కి ఏ మేరకు సెట్ అవుతుందనేది చూడాలి మరీ. గోపీచంద్ మ‌లినేని సినిమాతో పాటు అల్లు అర‌వింద్ నిర్మాణంలోనూ బాల‌య్య ఒక సినిమాకు ఓకే చెప్పాడు. క్రిష్ జాగ‌ర్ల‌మూడి ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More