మహేష్ ఫాదర్ గా కన్నడ స్టార్ హీరో ?

మహేష్ ఫాదర్ గా కన్నడ స్టార్ హీరో ?

Published on May 30, 2022 3:00 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న క్రేజీ సినిమాలో మరో కీలక పాత్ర ఉందని, ఆ పాత్రలో బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ నటించబోతున్నాడని గతంలో వార్తలు వచ్చాయి. అయితే.. ఇప్పుడు ఈ పాత్రలో మరో హీరో పేరు కూడా వినిపిస్తోంది. ఈ సినిమాలో సీనియర్ కన్నడ హీరో వి. రవిచంద్రన్ నటిస్తున్నాడట. రవిచంద్రన్ ది మహేష్ కి ఫాదర్ క్యారెక్టర్ అట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తోంది.

జులై నుంచి షూట్ స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ముందుగా మహేష్ పై సోలో సాంగ్ ను అలాగే ఒక ఫైట్ ను తీస్తారట. ఆ తర్వాత లాంగ్ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తారట. ఇక పదకొండు సంవత్సరాల తరువాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత, అల్లు అర్జున్ తో ‘అల వైకుంఠపురములో’ వంటి వరుస హిట్ చిత్రాల తర్వాత త్రివిక్రమ్ ఈ సినిమా చేస్తున్నాడు. అందుకే ఈ సినిమా పై రెట్టింపు అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు