విజయ్ దేవరకొండ సరసన కన్నడ హీరోయిన్ !


‘అర్జున్ రెడ్డి’ సినిమాతో అన్ని పరిశ్రమలకు హాట్ టాపిక్ గా మారిపోయాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. దీంతో అతను చేస్తున్న తదుపరి చిత్రాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం అతను చేస్తున్న సినిమాల్లో ప్రముఖహ్ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ చిత్రం కూడా ఉంది. పరశురామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా లావణ్య త్రిపాఠిని అనుకున్నారు.

కానీ కొన్ని కారణాల వలన ఆమె ఈ సినిమా నుండి తప్పుకున్నారు. దీంతో దర్శక నిర్మాతలు కొత్త హీరోయిన్ కోసం వెతుకుతూ కన్నడ నటి రష్మిక మందన్నను ఫైనల్ చేశారు. రష్మిక తన మొదటి చిత్రం ‘కిరిక్ పార్టీ’ తో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరు అనే వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.