గతంలోనూ కన్నడ స్టార్‌ హీరోలు హఠాన్మరణం !

Published on Oct 31, 2021 10:12 pm IST

పునీత్‌ రాజ్‌ కుమార్‌ మరణం అందర్నీ విషాదంలో నింపింది. ఆయన అకాల మరణాన్ని అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా కన్నడ ఇండస్ట్రీ ఒక మంచి హీరోని కోల్పోయింది. అయితే, ఇలా జరగడం కన్నడ ఇండస్ట్రీకి కొత్తేమి కాదు. గతంలోనూ పలువురు కన్నడ స్టార్‌ హీరోలు హఠాన్మరణం చెందారు.

2009లో కన్నడ మెగాస్టార్ విష్ణువర్ధన్ తన 58 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించారు. ఆయన కూడా అప్పుడు కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో అగ్ర హీరో.
ఇక 1990లో శంకర్ నాగ్ అనే స్టార్‌ హీరో కూడా కేవలం 35 ఏళ్ల వయసులో చనిపోయాడు. అలాగే 2020 జూన్‌7న కన్నడ హీరో చిరంజీవి సర్జా గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. చిరంజీవి సర్జా బిజీ హీరో. పైగా యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌కు స్వయానా మేనల్లుడు.

సంబంధిత సమాచారం :

More