కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ ‘వేద’ తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్

Published on Feb 4, 2023 1:01 am IST


కన్నడ సినిమా పరిశ్రమలో తిరుగులేని స్టార్డం తో శివన్న గా సూపర్ క్రేజ్ తో కొనసాగుతున్నారు శివ రాజ్ కుమార్. ఆయన కెరీర్ 125వ మూవీ అయిన వేద 2022 డిసెంబర్ లో కన్నడ లో రిలీజ్ అయి పెద్ద సక్సెస్ అందుకుంది. ఏ హర్ష దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫిబ్రవరి 9న గ్రాండ్ గా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కి రెడీ అయింది.

కంచి కామాక్షి కోల్కతా కాళీ క్రియేషన్స్ వారు ఈ మూవీని తెలుగు రాష్ట్రల్లో రిలీజ్ చేయనున్నారు. గీత పిక్చర్స్, జీ స్టూడియోస్ సంస్థలపై ఎంతో భారీ వ్యయంతో గ్రాండ్ గా నిర్మితం అయిన ఈ మూవీలో ఘనవి లక్ష్మణ్, ఉమాశ్రీ, అదితి సాగర్, శ్వేతా చెంగప్ప తదితరులు కీలక పాత్రలు పోషించగా అర్జున్ జన్య మ్యూజిక్ అందించారు. ఇటు తెలుగు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఏర్పరిచిన వేద మూవీ రిలీజ్ తరువాత ఎంత మేర అంచనాలు అందుకుంటుందో చూడాలని అంటున్నారు సినీ విశ్లేషకులు.

సంబంధిత సమాచారం :