మంచు వారి యంగ్ హీరో మంచు విష్ణు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “కన్నప్ప” కోసం తెలిసిందే. తన డ్రీం ప్రాజెక్ట్ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం పాన్ ఇండియా ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రం కోసం మంచు కుటుంబం ఏకంగా పాన్ ఇండియా లెవెల్ స్టార్స్ ని ఏకం చేసి తీసుకొచ్చారు. దీనితో ఓ రకంగా మన ఇండియన్ సినిమా దగ్గర బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ కూడా ఇది అని చెప్పవచ్చు.
ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం నుంచి మేకర్స్ నేడు రెండో టీజర్ ని రిలీజ్ కి తీసుకొచ్చారు. మరి ఈ టీజర్ మాత్రం సాలిడ్ ఎలిమెంట్స్ తో పర్ఫెక్ట్ గా ఉందని చెప్పాలి. తమ గూడెంల మీద శత్రు సైన్యం దండెత్తి వస్తున్న సమయంలో వారిని కాపాడే నాస్తికుడు అయిన తిన్నడు పాత్రలో మంచు విష్ణు మంచి స్క్రీన్ ప్రెజెన్స్ తో కనిపిస్తున్నాడని చెప్పవచ్చు.
అలాగే కథ పరంగా అక్షయ్ కుమార్ మహాశివునిగా, కాజల్ పార్వతిగా అద్భుతంగా కనిపిస్తుండగా వారిపై డైలాగ్స్ మరింత ఆసక్తిని పెంచాయని చెప్పవచ్చు. ఇక ఇతర తారాగణం మోహన్ లాల్, మోహన్ బాబు, శరత్ కుమార్ ఇలా ఆల్మోస్ట్ అందరినీ ఈ టీజర్ లో చూపించారు. ఇక బిగ్ హైలైట్ అయితే రెబల్ స్టార్ ప్రభాస్ ప్రెజెన్స్ అని చెప్పాల్సిందే.
టీజర్ ఎండింగ్ లో అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కి పూనకాలు ఇచ్చేలా కట్ చేయడం టీజర్ పై మరింత హైప్ తీసుకొచ్చింది. ఇక ఇందులో పలు విజువల్స్ కూడా సాలిడ్ గా కనిపిస్తున్నాయి. డెఫినెట్ గా ఇందులో నిర్మాణ విలువలు స్టన్నింగ్ అని చెప్పవచ్చు. అలాగే సంగీతం, సినిమాటోగ్రఫీ కూడా ఈ టీజర్ లో బాగున్నాయి. ఇక ఈ అవైటెడ్ సినిమా ఈ మార్చ్ 25న పాన్ వరల్డ్ లెవెల్లో రిలీజ్ కి రాబోతుంది.
టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి