‘కన్నప్ప’ : ఎగ్జైటింగ్ అప్ డేట్ కి టైం లాక్

Published on Nov 21, 2023 6:31 pm IST

మంచు విష్ణు హీరోగా 24 ఫ్రేమ్స్ ఫాక్టరీ, ఏ వి ఏ ఎంటర్టైన్మెంట్స్ సంస్థల పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితం అవుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ ప్రాజక్ట్ కన్నప్ప. ఈ మూవీని ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తుండగా ప్రస్తుతం దీని యొక్క షూటింగ్ న్యూజిలాండ్ లో వేగంగా జరుగుతోంది. ప్రభాస్, నయనతార, మోహన్ లాల్, మోహన్ బాబు, శరత్ కుమార్, మధుబాల, శివ రాజ్ కుమార్ వంటి వారు ఈ మూవీలో కీలక పాత్రలు చేస్తుండగా కన్నప్ప పాత్రలో మంచు విష్ణు అద్భుతంగా యాక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా విషయం ఏమిటంటే, నవంబర్ 23న విష్ణు బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుండి అదేరోజు తెల్లవారుఝామున 2 గం. 45 ని. లకు ఒక ఎగ్జైటింగ్ అప్ డేట్ ని అందించనున్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం ఒక ప్రకటన ఇచ్చారు. పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయిమాధవ్, తోట ప్రసాద్ స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ మూవీకి స్టీఫెన్ దేవస్సీ, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. కాగా కన్నప్ప గురించి త్వరలో మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి.

సంబంధిత సమాచారం :