“కాంతార” మొదట హీరో పునీత్ రాజ్ కుమారే !

“కాంతార” మొదట హీరో పునీత్ రాజ్ కుమారే !

Published on Oct 31, 2022 3:00 PM IST

రిషబ్ శెట్టి హీరోగా వచ్చిన “కాంతార” చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కన్నడ లోనే కాకుండా ‘కాంతార’ అన్ని భాషల్లోనూ అద్భుతమైన కలెక్షన్లు నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. అయితే, రిషబ్ శెట్టి మొదట కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కోసం ఈ కథను రాశాడట. పునీత్ రాజ్ కుమార్ దగ్గరకు వెళ్లి రిషబ్ శెట్టి ‘కాంతార’ స్టోరీని కూడా చెప్పాడట.

దేవుడి బ్యాక్ డ్రాప్ లో ఉన్న ‘కాంతార’ కథ మొత్తం విన్న పునీత్ రాజ్ కుమార్ కథ బాగుంది అంటూ రిషబ్ శెట్టిని ఎంతగానో మెచ్చుకున్నాడు. కథలో హీరోను దేవుడి ఆవహించిన పాయింట్ పునీత్ కి బాగా నచ్చింది. అయితే, రిషబ్ శెట్టి కథ చెబుతున్న సమయంలో హీరో పాత్రలో ఇన్ వాల్వ్ అయిన విధానం చూసిన పునీత్.. ఈ కథలో నువ్వు నటిస్తేనే బాగుంటుందని రిషబ్ శెట్టికి సూచించాడు. పునీత్ ఇచ్చిన ధైర్యంతోనే రిషబ్ శెట్టి ‘కాంతార’లో నటించి గొప్ప విజయాన్ని అందుకున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు