తెలుగులో భారీ మార్క్ అందుకున్న “కాంతారా” వసూళ్లు.!

తెలుగులో భారీ మార్క్ అందుకున్న “కాంతారా” వసూళ్లు.!

Published on Nov 12, 2022 12:00 PM IST

కన్నడ స్టార్ నటుడు రిషబ్ శెట్టి హీరోగా తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ భారీ హిట్ చిత్రం “కాంతారా”. మరి తాను తీసిన ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో సాలిడ్ డివోషనల్ హిట్ కాగా ఈ చిత్రం మన తెలుగులో కూడా భారీ వసూళ్ళని ఈ చిత్రం నమోదు చేసింది. మరి లేటెస్ట్ గా అయితే తెలుగులో ఈ చిత్రం మరో భారీ మార్క్ ని టచ్ చేసినట్టుగా తెలుస్తుంది.

మరి ఈ చిత్రం అయితే తెలుగులో లేటెస్ట్ గా మొత్తం 25 కోట్ల షేర్ మార్క్ ని అయితే టచ్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనితో అయితే మన తెలుగులో కాంతారా ఏ రేంజ్ హిట్ అయ్యిందో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రంలో సప్తమి గౌడ హీరోయిన్ గా నటించగా అజనీష్ లోకనాథ్ సంగీతం అందించాడు. అలాగే హోంబళే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో గీతా ఆర్ట్స్ వారు రిలీజ్ చేసారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు