హిందీలో ఆ భారీ సినిమాని దాటేసిన “కాంతారా” వసూళ్లు.!

హిందీలో ఆ భారీ సినిమాని దాటేసిన “కాంతారా” వసూళ్లు.!

Published on Oct 27, 2022 5:10 PM IST


ఈ ఏడాది సౌత్ ఇండియన్ సినిమా దగ్గర సహా పాన్ ఇండియా మార్కెట్ లో కూడా సెన్సేషన్ ని రేపిన చిత్రాల్లో కన్నడ లేటెస్ట్ చిత్రం “కాంతారా” కూడా ఒకటి. హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో హిందీలో కూడ భరే హిట్ అయ్యింది. స్టడీ వసూళ్లతో మంచి నంబర్స్ నమోదు చేస్తూ వస్తున్న ఈ చిత్రం అయితే ఇటీవల వచ్చిన తమిళ భారీ బడ్జెట్ చిత్రం “పొన్నియిన్ సెల్వన్” లైఫ్ టైం వసూళ్లు క్రాస్ చేసేసినట్టు తెలుస్తుంది.

మరి పొన్నియిన్ సెల్వన్ కి హిందీలో సుమారు 29 కోట్ల మేర వసూళ్లు అందుకోగా మరి దీనిని అయితే కాంతారా ఇప్పుడు క్రాస్ చేసేసినట్టు ట్రేడ్ వర్గాల వారు చెప్తున్నారు. ఇప్పుడు కాంతారా అయితే 29.5 కోట్ల మార్క్ దగ్గరకి చేరుకుంది. అలాగే ఇది ఇంకా కొనసాగుతుంది కూడా.. దీనితో అయితే కాంతారా హిందీలో మరిన్ని మంచి వసూళ్లు అందుకోనున్నట్టుగా బాలీవుడ్ వర్గాలు కూడా చెబుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు