యూఎస్ లో కొనసాగుతున్న “కాంతారా” హవా.!

యూఎస్ లో కొనసాగుతున్న “కాంతారా” హవా.!

Published on Nov 2, 2022 10:00 AM IST

కన్నడ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ మరియు హీరో రిషబ్ శెట్టి హీరోగా నటించిన లేటెస్ట్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం “కాంతారా”. కన్నడ తెలుగు సహా హిందీ భాషల్లో భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్ లో కూడా చిన్న గానే స్టార్ట్ అయ్యినా వండర్స్ నమోదు చేస్తుంది. ఇక యూఎస్ మార్కెట్ లో అయితే లేటెస్ట్ గా ఈ చిత్రం మరో మార్క్ అందుకున్నట్టుగా తెలుస్తుంది.

లేటెస్ట్ వసూళ్లు అయితే ఈ చిత్రం 1.8 మిలియన్ డాలర్స్ మార్క్ అందుకోగా ఇప్పటికీ కూడా స్ట్రాంగ్ గా ఈ రన్ కొనసాగుతున్నట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీనితో జస్ట్ కొన్ని రోజుల్లో ఈ చిత్రం డెఫినెట్ గా 2 మిలియన్ క్లబ్ లో అయితే జాయిన్ అవుతుందని కూడా తెలుస్తుంది. మొత్తానికి అయితే కాంతారా హవా గట్టిగానే ఉందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా హోంబళే ఫిలిమ్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు