ఈ ఏడాది తన ఫేవరెట్ మూవీ పై కాంతార హీరో కామెంట్స్!

Published on Dec 14, 2022 10:09 pm IST


రిషబ్ శెట్టి తన కాంతార సినిమా విజయం తర్వాత ఓవర్ నైట్ సెన్సేషన్ అయ్యాడు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్ల రూపాయల కి పైగా వసూలు చేసి భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం లో నటించడం మాత్రమే కాకుండా రచన, దర్శకత్వం వహించారు. రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ వెర్షన్ రావడంతో రిషబ్ సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు.

ఓ ఇంటర్వ్యూలో రిషబ్ మాట్లాడుతూ, తమిళ చిత్రం లవ్ టుడే ఈ ఏడాది తనకు ఇష్టమైన సినిమా అని వెల్లడించాడు. కన్నడ నుండి వచ్చిన చార్లీ 777 చిత్రం తనకు నచ్చిన అత్యుత్తమ చిత్రం అని కూడా ఆయన తెలిపారు. రిషబ్ తన కొత్త చిత్రాన్ని ఇంకా ప్రకటించలేదు. తను నెక్స్ట్ ఎలాంటి సినిమా అనౌన్స్ చేస్తారో అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :