వైరల్ పిక్ : ‘కాంతారా’ హీరో క్యూట్ ఫామిలీ

వైరల్ పిక్ : ‘కాంతారా’ హీరో క్యూట్ ఫామిలీ

Published on Nov 5, 2022 12:00 AM IST


లేటెస్ట్ గా కాంతారా మూవీ భారీ విజయంతో ఒక్కసారిగా నటుడిగా మన దేశంతో పాటు అనేక దేశాల ఆడియన్స్ నుండి కూడా గొప్ప పేరు సొంతం చేసుకున్నారు కన్నడ నటుడు రిషబ్ శెట్టి. ఇటీవల కన్నడలో తెరకెక్కి అక్కడ కలెక్షన్స్ ప్రభంజనం సృష్టిస్తున్న కాంతారా, ఇటు తెలుగు, హిందీ సహా పలు ఇతర భాషల్లో సైతం దూసుకెళుతోంది. మరోవైపు ఈ మూవీ పై అనేకమంది సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపిస్తుండడం విశేషం.

అయితే విషయం ఏమిటంటే, ప్రస్తుతం కాంతారా భారీ విజయాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న హీరో రిషబ్ శెట్టి లేటెస్ట్ గా తన ఫ్యామిలీ తో కలిసి దిగిన ఒక క్యూట్ ఫోటోని తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసారు. ఈ ఫొటోలో ట్రెడిషనల్ డ్రెస్ లో రిషబ్ శెట్టి, ఆయన భార్య ప్రగతి శెట్టి, కూతురు రాధ్య, కొడుకు రన్విత్ శెట్టి లతో లను చూడవచ్చు. మొత్తంగా చూడముచ్చటగా ఎంతో క్యూట్ గా ఉన్న ఈ ఫామిలీ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు