హిందీ లో కొనసాగుతున్న కాంతార దూకుడు!

హిందీ లో కొనసాగుతున్న కాంతార దూకుడు!

Published on Oct 26, 2022 3:01 AM IST

రిషబ్ శెట్టి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కాంతార. ఈ చిత్రం కన్నడ లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం కన్నడ లో సూపర్ సక్సెస్ కావడం తో, సౌత్ లోని ప్రధాన బాషల్లో మరియు హిందీ లో కూడా విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రం విడుదల అయిన అన్ని చోట్ల మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది.

హిందీ లో కూడా కాంతార తన దూకుడు కొనసాగిస్తోంది. ఈ చిత్రం సోమవారం నాడు 1.9 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లను రాబట్టింది. దీంతో ఇప్పటి వరకూ హిందీ లో 24 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లను రాబట్టింది. చిన్న సినిమాగా విడుదలై ఈ తరహా దూకుడు ను కొనసాగించడం పట్ల సినీ పరిశ్రమ ki చెందిన ప్రముఖులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా కి రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. లాంగ్ రన్ లో ఈ చిత్రం ఎలాంటి వసూళ్లను రాబడుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు