అక్కడ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న “కాంతార”

అక్కడ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న “కాంతార”

Published on Oct 31, 2022 1:00 PM IST

చిన్న సినిమాగా విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న చిత్రం కాంతార. రిషబ్ శెట్టి హీరోగా నటించిన ఈ చిత్రం కన్నడ, తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా, నార్త్ లో సైతం సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ చిత్రం హిందీ లో భారీ వసూళ్లు రాబడుతూ అందరికీ ఆశ్చర్యం ను కలిగిస్తుంది. ఈ చిత్రం ఆదివారం మరో 4.40 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. దీంతో ఇప్పటి వరకూ హిందీ లో 43 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లను రాబట్టింది.

హీరోగా నటించడం మాత్రమే కాకుండా, ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించారు రిషబ్ శెట్టి. ఈ చిత్రం లో సప్తమి గౌడ హీరోయిన్ గా నటించగా, హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించారు. ఈ చిత్రం లాంగ్ రన్ లో భారీ వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు