మరో భాషలో రిలీజ్ కానున్న కాంతార?

మరో భాషలో రిలీజ్ కానున్న కాంతార?

Published on Nov 15, 2022 10:50 PM IST


రిషబ్ శెట్టి హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం కాంతార బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. సినిమా విడుదలైనప్పటి నుండి టిక్కెట్ల వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ బజ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా మరో భాషలో విడుదల కానుండటం విశేషం.

తాజా గాసిప్ ప్రకారం, ఈ చిత్రాన్ని తుళు భాషలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేసారు. అందుకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కాంతార యొక్క తుళు డబ్బింగ్ వెర్షన్ డిసెంబర్ 2022 మొదటి వారంలో విడుదల కానుందని వినికిడి. దీని పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సప్తమి గౌడ, అచ్యుత్ కుమార్, కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అంజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు