లేటెస్ట్: డైరెక్టర్ అజయ్ భూపతి నెక్స్ట్ మూవీ కి కాంతార మ్యూజిక్ డైరెక్టర్!

Published on Jan 20, 2023 11:19 pm IST


ఆర్ఎక్స్ 100 చిత్రం తో అందరి దృష్టి ఆకర్షించిన యంగ్ డైరెక్టర్ అజయ్ భూపతి. తన సొంత బ్యానర్ ఎ క్రియేటివ్ వర్క్స్ మరియు ముద్ర మీడియా వర్క్స్ పతాకాల పై న్యూ జానర్ కథతో తన మూడవ చిత్రం కి ఇటీవల శ్రీకారం చుట్టారు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ ను చిత్ర యూనిట్ తాజాగా అనౌన్స్ చేయడం జరిగింది. విక్రాంత్ రోణ, కాంతార వంటి చిత్రాలకి సెన్సేషనల్ ఆల్బమ్ అందించిన అజనీష్ లోకనాథ్, అజయ్ భూపతి మూడవ చిత్రానికి సంగీతం అందించనున్నారు.

సరికొత్త కథ కథనాలతో తెరకెక్కనున్న ఈ చిత్ర టైటిల్ ని, ఇతర నటీనటుల వివరాలని త్వరలో వెల్లడించనున్నట్లు తెలిపిన దర్శకుడు అజయ్ భూపతి, అజనీష్ లాంటి ప్రతిభ గల సంగీత దర్శకుడితో తన సొంత బ్యానర్ లో చేయనున్న మొదటి చిత్రం లో పని చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.

సంబంధిత సమాచారం :