అఫీషియల్ : ‘కాంతారా’ అమెజాన్ లో స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

అఫీషియల్ : ‘కాంతారా’ అమెజాన్ లో స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

Published on Nov 23, 2022 5:24 PM IST

ఇటీవల కన్నడలో తెరకెక్కి సూపర్ హిట్ కొట్టిన కాంతారా మూవీ, అనంతరం తెలుగు సహా పలు ఇతర భాష్లల్లో కూడా రిలీజ్ అయి అన్ని చోట్ల ఎంత పెద్ద సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే రూ.400 కోట్ల కలెక్షన్ దక్కించుకున్న కాంతారా పై అనేకమంది ప్రేక్షకాభిమానుల తోపాటు పలువురు సినీ విశ్లేషకులు, విమర్శకులు సైతం ప్రసంశలు కురిపించారు. రిషబ్ శెట్టి స్వయంగా నటిస్తూ తెరకెక్కించిన ఈ డివైన్ బ్లాక్ బస్టర్ మూవీలో సప్తమి గౌడ హీరోయిన్ గా నటించగా హోంబలె ఫిలిమ్స్ వారు దీనిని ఎంతో గ్రాండ్ గా నిర్మించారు. అయితే ఈ ప్రతిష్టాత్మక సినిమా ఓటిటి రిలీజ్ కోసం అన్ని భాషల ఆడియన్స్ ఎప్పటినుండో ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

కాగా ఫైనల్ గా ఈ మూవీ నేడు అర్ధరాత్రి నుండి అనగా డేట్ ప్రకారం నవంబర్ 24 నుండి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల ఆడియన్స్ కి ప్రముఖ ఓటిటి మాధ్యమం అమెజాన్ ప్రైమ్ ద్వారా అందుబాటులోకి రానుంది. అయితే హిందీ వర్షన్ గురించి మాత్రం అప్ డేట్ రావలసి ఉంది. మరి థియేటర్స్ లో అదరగొట్టిన కాంతారా, ఓటిటి లో ఆడియన్స్ నుండి ఎంత మేర క్రేజ్ అందుకుంటుందో చూడాలని అంటున్నారు విశ్లేషకులు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు