మరొక భాషలో రిలీజ్ కి రెడీ అయిన బ్లాక్ బస్టర్ ‘కాంతారా’

Published on Nov 24, 2022 7:31 pm IST

హోంబలె ఫిలిమ్స్ బ్యానర్ పై రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన తాజా మూవీ కాంతారా. ముందుగా కన్నడలో రిలీజ్ అయి అక్కడ పెద్ద విజయం అందుకున్న ఈ మూవీ, అనంతరం తెలుగు తోపాటు పలు ఇతర భాషల్లో రిలీజ్ అయి అన్నిచోట్లా పెద్ద బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ మూవీలో సప్తమి గౌడ హీరోయిన్ గా నటించగా ప్రమోద్ శెట్టి, అచ్యుత్ కుమార్, కిశోర్ కుమార్ తదితరులు కీలక పాత్రలు చేసారు.

ఇక నేటి నుండి అమెజాన్ ప్రైమ్ ద్వారా ఓటిటి ప్రేక్షకులకి కూడా అందుబాటులోకి వచ్చిన కాంతారా మంచి వ్యూస్ సొంతం చేసుకుంటోంది. కాగా ఈ మూవీ డిసెంబర్ 2న తుళు భాషలో ఇండియాలో రిలీజ్ కి రెడీ అయింది. అలానే ఓవర్సీస్ ఆడియన్స్ కూడా తుళు భాషలో రేపటి నుండి కాంతారా ని థియేటర్స్ లో చూడవచ్చు. కాగా ఇప్పటికే అన్ని భాషల్లో అదరగొట్టి సూపర్ గా కలెక్షన్ సొంతం చేసుకున్న ఈ మూవీ తప్పకుండా తుళు లో కూడా దూసుకెళ్లడం ఖాయంగా కనపడుతోందని అంటున్నారు సినీ విశ్లేషకులు.

సంబంధిత సమాచారం :