నైజాంలో “కాంతారా” సెన్సేషన్.. లేటెస్ట్ వసూళ్ల డీటెయిల్స్..!

నైజాంలో “కాంతారా” సెన్సేషన్.. లేటెస్ట్ వసూళ్ల డీటెయిల్స్..!

Published on Oct 23, 2022 3:28 PM IST

కన్నడ లేటెస్ట్ సెన్సేషనల్ హిట్ చిత్రం “కాంతారా” కోసం అందరికీ తెలిసిందే. మరి దర్శకుడు సహా హీరోగా చేసిన రిషబ్ శెట్టి ఈ చిత్రం తెరకెక్కించగా కన్నడ సహా తెలుగు మరియు హిందీ భాషలలో ఈ చిత్రం వసూళ్లతో సెన్సేషన్ ని నమోదు చేసింది. ఇక ఈ చిత్రం అయితే తెలుగులో అదే అదిరే రన్ ని కొనసాగిస్తోంది. మరి నిన్న రెండో శనివారం ఈ చిత్రం ఒక్క నైజాం లోనే 1.15 కోట్ల నెట్ వసూళ్లు కలెక్ట్ చేసి సత్తా చాటింది.

దీనితో తెలుగులో మళ్ళీ ఈ సినిమా వసూళ్లు బలపడ్డాయని చెప్పాలి. ఇక దీనితో అయితే ఈ ఎనిమిది రోజుల్లో ఈ చిత్రం నైజాం లో 5.2 కోట్ల షేర్ ని ఈ చిత్రం అందుకుని భారీ లాభాలు దిశగా వెళ్తుంది. ఇక ఈ చిత్రంలో సప్తమి గౌడ హీరోయిన్ గా నటించింది అలాగే అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా హోంబళే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే తెలుగులో గీతా ఆర్ట్స్ వారు రిలీజ్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు