“కాంతారా” సెన్సేషన్.. నైజాంలో ఇప్పటికీ అదిరే వసూళ్లు.!

“కాంతారా” సెన్సేషన్.. నైజాంలో ఇప్పటికీ అదిరే వసూళ్లు.!

Published on Oct 30, 2022 2:00 PM IST

కన్నడ స్టార్ నటుడు రిషబ్ శెట్టి హీరోగా అలాగే తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ భారీ హిట్ చిత్రం “కాంతారా ది లెజెండ్”. మొదట కన్నడలో రిలీజ్ అయ్యి అదరగొట్టిన ఈ చిత్రం నెక్స్ట్ తెలుగు సహా హిందీలో రిలీజ్ అయ్యి భారీ వసూళ్లు అందుకొని ఇప్పటికీ కూడా సాలిడ్ వసూళ్లతో దూసుకెళ్తుంది. ఇక తెలుగులో అయితే నైజాం లో ఈ చిత్రం వండర్స్ సెట్ చేస్తుందని చెప్పి తీరాలి.

సినిమా లేటెస్ట్ గా 15వ రోజున కూడా ఒక్క నైజాం నుంచే 1 కోటికి పైగా నెట్ వసూళ్లు నమోదు చేయడం విశేషం. మరి ఈ 15వ రోజు నైజాం లో కాంతారా చిత్రం 1.35 కోట్ల నెట్ వసూళ్లు అందుకుంది. దీనితో ఇప్పటికీ కూడా కాంతారా సెన్సేషన్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రంలో సప్తమి గౌడ హీరోయిన్ గా నటించగా హోంబళే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే తెలుగులో ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ వారు రిలీజ్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు