యూఎస్ లో రికార్డు మైల్ స్టోన్ అనుకున్న “కాంతారా”.!

యూఎస్ లో రికార్డు మైల్ స్టోన్ అనుకున్న “కాంతారా”.!

Published on Nov 6, 2022 9:22 PM IST


లేటెస్ట్ గా పాన్ ఇండియా సహా కన్నడ సినిమా దగ్గర సెన్సేషనల్ హిట్ చిత్రం “కాంతారా” ఎలాంటి వండర్స్ నమోదు చేస్తుందో తెలిసిందే. మరి ఇప్పుడు ఈ చిత్రం అయితే దగ్గరకి 20 రోజులకి పైగా థియేట్రికల్ రన్ ని కంటిన్యూ చేసుకుంటూ వస్తుంది. ఇక మన తెలుగు స్టేట్స్ లోనే కాకుండా హిందీ ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం సాలిడ్ రన్ ని కనబరుస్తూ వస్తుంది.

మరి దీనితో అయితే ఈ చిత్రం లేటెస్ట్ గా యూఎస్ లో మరో భారీ మైల్ స్టోన్ ని అయితే చేరుకున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రం లేటెస్ట్ గా 2 మిలియన్ డాలర్స్ వసూళ్ల క్లబ్ లో చేరింది. దీనితో ఈ ఏడాదిలో కన్నడ నుంచి మరో సినిమాగా ఇది ఈ మార్క్ తో నిలిచింది. ఇక ఈ డివోషనల్ హిట్ లో హీరోగా రిషబ్ శెట్టి నటించగా తానే ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. అలాగే సప్తమి గౌడ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు