రెండు మూడు రోజుల్లో ఆర్ ఆర్ ఆర్ మూవీ వంద కోట్లు సాధిస్తుంది – కరణ్ జోహార్

Published on Dec 28, 2021 4:20 pm IST


రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం రౌద్రం రణం రుధిరం. ఈ చిత్రం జనవరి 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ సినిమా అన్ని రికార్డు లను కొల్లగొట్టడం ఖాయం. బాహుబలి సిరీస్ చిత్రాలను హిందీ లో విడుదల చేసిన కరణ్ జోహార్ తాజాగా ఆర్ ఆర్ ఆర్ మూవీ పై కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

ఈ ఆర్ ఆర్ ఆర్ మూవీ విడుదలైన రెండు మూడు రోజుల్లో 100 కోట్ల రూపాయల ను వసూలు చేస్తుంది అంటూ చెప్పుకొచ్చారు.తెలుగు లో కూడా ఈ చిత్రం గత రికార్డ్ లను బద్దలు కొడుతుందని అన్నారు. ఈ చిత్రం లో అలియా భట్, ఒలివియా మోరిస్, శ్రియ శరణ్, అజయ్ దేవగన్, సముద్ర ఖని లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :