బాలీవుడ్‌లో మరో భారత మాజీ క్రికెటర్ బయోపిక్..!

Published on Oct 7, 2021 1:15 am IST


బాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా బాగా నడుస్తుందని చెప్పాలి. ఇక క్రీడాకారుల బయోపిక్‌లకు మంచి ఆదరణ ఉంది. అయితే క్రికెటర్ల విషయానికి వస్తే కపిల్‌దేవ్, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ బయోపిక్‌లు తెరకెక్కిన సంగతి తెలిసిందే. అయితే బాలీవుడ్ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం తాజాగా మరో భారత మాజీ క్రికెటర్ బయోపిక్ తెరకెక్కబోతున్నట్టు తెలుస్తుంది.

టీమిండియా సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్ బయోపిక్‌ని ప్రముఖ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ తెరక్కించేందుకు రెడీ అయ్యాడని తెలుస్తుంది. ఈ మేరకు యువీతో కరణ్ సంప్రదింపులు జరపగా దానికి యువీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చర్చ నడుస్తుంది. అయితే తన బయోపిక్‌లో హృతిక్‌ రోషన్‌, రణ్‌బీర్‌ కపూర్‌లలో ఎవరో ఒకరు హీరోగా నటిస్తే బాగుంటుందని గతంలో యువీ చెప్పాడని, కానీ కరణ్ మాత్రం కొత్త ముఖం వైపు చూస్తున్నాడని తెలుస్తుంది. అయితే త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట.

సంబంధిత సమాచారం :