టాలీవుడ్ ను చూసి బాలీవుడ్ నేర్చుకోవాలి – కరణ్‌ జోహార్

Published on Mar 28, 2022 9:06 pm IST

రాజమౌళి – ఎన్టీఆర్ – రామ్ చరణ్ కలయికలో వచ్చిన భారీ క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. కాగా ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. ఆల్ టైమ్ రికార్డు లను క్రియేట్ చేస్తూ దూసుకువెళుతుంది. మరో పక్క సినీ ప్రముఖులు సైతం ఈ సినిమా చూసి ఫిదా అయిపోతున్నారు. తాజాగా బాలీవుడ్ అగ్రదర్శక నిర్మాత కరణ్‌ జోహార్ సైతం ఈ సినిమా గురించి పొగుడుతూ పోస్ట్ పెట్టాడు.

ఇంతకీ కరణ్‌ జోహార్ ఏమి పోస్ట్ పెట్టాడు అంటే.. ‘టాలీవుడ్ నుంచి వస్తున్న విభిన్న తరహా చిత్రాలను చూసైనా.. బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ అప్ డేట్ అవ్వాల్సి ఉంది. బాలీవుడ్‌ లో ఎక్కువుగా మూసధోరణి కొనసాగుతుంది. బయోపిక్స్‌ హిట్‌ అయితే అంతా ఆ తరహా సినిమాలే తీస్తారు. ఒకవేళ మరో జోనర్ సినిమాలు హిట్ అయితే.. అందరూ అవే కథలను ఎంచుకుని సినిమాలు చేస్తారు.

కానీ తెలుగు సినిమా పరిశ్రమలో అలా కాదు. అక్కడి దర్శకులు తమ సొంత ఆలోచనలతో సినిమాలను తీస్తున్నారు. అందుకే రీసెంట్ గా వచ్చిన పుష్ప, ఇప్పుడు వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లాంటి చిత్రాలు బాలీవుడ్‌ లో కూడా చాలా గొప్ప విజయాలను అందుకుంటున్నాయి’ అంటూ కరణ్‌ జోహార్ చెప్పుకొచ్చాడు.

సంబంధిత సమాచారం :