కరీనా పై అమీషా పటేల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published on Sep 3, 2023 11:00 pm IST

మాజీ బ్యూటీ అమీషా పటేల్ నటించిన “గదర్ 2” ప్రపంచవ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ అయ్యింది. పైగా అమీషా పటేల్ పాత్ర కూడా బాగా పేలింది. దీంతో ఇప్పుడు అమీషా పటేల్ కి హిందీలో మళ్లీ క్రేజ్ పెరిగింది. మొత్తానికి లేటు వయసులో అమీషాకి వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలో అమీషా పటేల్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ క్రమంలో ఆమె, కరీనా కపూర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. సూపర్ డూపర్ హిట్ మూవీ అయిన ‘కహో నా ప్యార్ హై’ సినిమా నుండి కరీనా కపూర్ తప్పుకున్న సంగతి తెలిసిందే.

ఐతే, ఆ సినిమా నుంచి కరీనా కపూర్ తప్పుకోలేదని, ఆమెను కావాలని తప్పించారని అమీషా పటేల్ చెప్పుకొచ్చింది. 2000లో హృతిక్ రోషన్ హీరోగా, అమీషా పటేల్ హీరోయిన్‌గా వచ్చిన ఈ సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టులో హీరోయిన్‌గా తొలుత కరీనా కపూర్‌ ను అనుకున్నారని, కానీ ఆమెను తప్పించి తనను తీసుకోవడం పై అమీషా పై వ్యాఖ్యలు చేసింది.

సంబంధిత సమాచారం :