ఆ సినిమా చూసి కన్నీరు పెట్టుకున్న ముఖ్యమంత్రి..!

Published on Jun 15, 2022 1:00 am IST

కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘777 చార్లీ’. కిరణ్‌రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3న రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. పెంపుడు కుక్క ఉన్న ప్రతి ఒక్కరు ఈ సినిమాను చూసి కంటతడి పెట్టుకుంటున్నారు. ఇక ఇప్పటికే అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు.

అయితే తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మె ‘777 చార్లీ’ సినిమాను వీక్షించి కంటతడి పెట్టారు. థియేటర్‌లో ఆయన వెక్కి వెక్కి ఏడ్చారు. ఈ సినిమా చూసి తన పెట్ డాగ్ గుర్తొచ్చిందని బసవరాజ్ బొమ్మె చెప్పుకొచ్చారు. అంతకు ముందు కుక్కల మీద వచ్చిన ఎన్నో సినిమాలు చూసాను కానీ చార్లీ భావోద్వేగాన్ని నింపింది. సినిమా బాగుంది. అందరూ తప్పకుండా చూడాలని అన్నారు. కుక్క ప్రేమ షరతులు లేనిదని.. అది కుక్కలని పెంచే వారికే తెలుస్తుందని అన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

సంబంధిత సమాచారం :