నాని, దసరా విషయంలో కార్తీ బ్యూటిఫుల్ పోస్ట్.!

Published on Mar 28, 2023 2:00 pm IST

నాచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన లేటెస్ట్ నాటు మసాలా ఎంటర్టైనర్ చిత్రం “దసరా” కోసం తెలిసిందే. నాని కెరీర్ లో మొదటి పాన్ ఇండియా సినిమా ఇది కాగా దీని కోసం నాని సహా చిత్ర యూనిట్ అంతా కూడా తాము చెయ్యగలిగింది అంతా చేస్తూ భారీ హైప్ ని తెచ్చుకున్నారు.

మరి అన్ని భాషల్లో కూడా మంచి బజ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమాపై లేటెస్ట్ గా కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసాడు. మరి నాని కోసం మాట్లాడుతూ ఇప్పుడు ఎక్కడ చూసినా నాని నువ్వే కనిపిస్తున్నావని నిన్ను ఇలా ఎనర్జిటిక్ గా చూడడం ఆనందంగా ఉందని నీకు మరింత పవర్ తోడవ్వాలని కోరుకుంటున్నానని తెలిపాడు. దీనితో ఈ బ్యూటిఫుల్ పోస్ట్ మరింత బజ్ ని తీసుకురాగా నాని మరియు కార్తీ అభిమానులు ఈ పోస్ట్ తో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :