వైరల్ :’ సర్దార్ ‘ డైరెక్టర్ కి కార్తీ భారీ గిఫ్ట్

వైరల్ :’ సర్దార్ ‘ డైరెక్టర్ కి కార్తీ భారీ గిఫ్ట్

Published on Nov 3, 2022 1:07 AM IST


కార్తి హీరోగా లేటెస్ట్ గా తెరకెక్కిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ సర్దార్. రజీష విజయన్, రాశి ఖన్న హీరోయిన్స్ గా నటించిన ఈ థ్రిల్లింగ్ యాక్షన్ స్పై ఎంటర్టైనర్ మూవీ ని పీఎస్ మిత్రన్ తెరకెక్కించగా ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై లక్ష్మణ్ కుమార్ ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మించారు. ఈ మూవీని తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ద్వారా కింగ్ నాగార్జున రిలీజ్ చేశారు.

అటు తెలుగుతో పాటు ఇటు తమిళ్ లో కూడా సర్దార్ సూపర్ సక్సెస్ అందుకుంది. ఈ మూవీలో రెండు పాత్రల్లో కార్తి సూపర్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టగా డైరెక్టర్ మిత్రన్, మూవీ ని అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా అద్భుతంగా తెరకెక్కించారు. అయితే మ్యాటర్ ఏమిటంటే, సర్దార్ సూపర్ హిట్ కొట్టడంతో నేడు హీరో కార్తీ, డైరెక్టర్ పీఎస్ మిత్రన్ కి ప్రత్యేకంగా టయోటా ఫార్చ్యూనర్ ఎస్ యు వి కార్ ని బహుమతిగా అందించారు. కాగా మిత్రన్ కి కార్ తాళాలు అందించిన కార్తి, ఆయన తో కలిసి దిగిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు