“ఖైదీ 2” పై కార్తీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

“ఖైదీ 2” పై కార్తీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Published on Jul 10, 2024 3:00 AM IST

కోలీవుడ్ ప్రముఖ నటుడు కార్తీ కెరీర్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. చివరిసారిగా జపాన్ చిత్రంలో కనిపించారు. ఈ చిత్రం ప్రేక్షకులని అలరించడంలో విఫలం అయ్యింది. బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. అయితే తదుపరి సర్దార్ 2 తో పాటుగా మరికొన్ని చిత్రాలకు హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఖైదీ 2 చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

అభిమానులతో జరిగిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.ఖైదీ 2 చిత్రం 2025 లో ప్రారంభం అవుతుంది అని అన్నారు. వచ్చే ఏడాది లోకేష్ రానున్నట్లు తెలిపారు. మళ్ళీ బిర్యానీ బకెట్ తీసుకొనే సమయం వచ్చింది అంటూ చెప్పుకొచ్చారు. హీరో కార్తీ, ఖైదీ చిత్రంలో డిల్లీ పాత్రలో నటించి కేవలం తమిళ ఆడియెన్స్ ను మాత్రమే కాకుండా, తెలుగు ఆడియెన్స్ ను కూడా విశేషంగా ఆకట్టుకున్నారు. ఈ ఖైదీ 2 పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. లోకేష్ ప్రస్తుతం కూలీ చిత్రం ను సూపర్ స్టార్ రజినీకాంత్ తో చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు