కార్తీ ‘జపాన్’ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్

కార్తీ ‘జపాన్’ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్

Published on Nov 12, 2022 9:03 PM IST


ఇటీవల సర్ధార్ వంటి థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటెర్టైనర్ తో సూపర్ హిట్ కొట్టారు యువ నటుడు కార్తీ. పీఎస్ మిత్రన్ తెరకెక్కించిన సర్ధార్ లో కార్తీ డ్యూయల్ రోల్ చేయగా రాశి ఖన్నా, రజీషా విజయన్ హీరోయిన్స్ గా నటించారు. ఇక దానికి సీక్వెల్ గా రూపొందనున్న సర్ధార్ 2 లో త్వరలో నటించనున్న కార్తీ ప్రస్తుతం చేస్తున్న యాక్షన్ ఎంటెర్టైనర్ మూవీ జపాన్. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు ఎంతో భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీకి రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తుండగా అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది.

టాలీవుడ్ యాక్టర్ సునీల్ ఒక ముఖ్య పాత్ర చేస్తున్న జపాన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని నవంబర్ 14న రిలీజ్ చేస్తున్నట్లు కొద్దిసేపటి క్రితం మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. కార్తీ కెరీర్ 25వ మూవీ గా రూపొందుతున్న జపాన్ పై ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ మూవీ ఎంత మేర విజయం అందుకుంటుందో తెలియాలి అంటే కొన్నాళ్లపాటు ఆగాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు