కార్తి కథానాయకుడిగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఖైదీ’ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ను బాగానే సాధిస్తోంది. ఈ సినిమాకి రోజురోజుకి కలెక్షన్స్ పెరుగుతున్నాయి. కాగా నైజాం బాక్సాఫీస్ వద్ద ఖైదీ నాలుగో రోజు సాధించిన కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. గ్రాస్ రూ. 77,56,977 రాగా, నెట్ రూ. 67,09,086 వచ్చింది. అలాగే షేర్ విషయానికి వస్తే.. రూ. 30,57,663 వచ్చింది. కాగా నైజాంలో మొత్తం ‘ఖైదీ’ షేర్ ఇప్పటివరకూ రూ.94,17,531 లుగా ఉంది.
కాగా ఈ వారం కూడా ఖైదీ రన్ స్టడీగానే కొనసాగితే తెలుగు పంపిణీదారులు మంచి లాభాల్ని ఆర్జించే అవకాశం ఉంది. పైగా గత వారం తెలుగు సినిమాలేవీ విడుదల కాకపోవడం కూడా ‘ఖైదీ’కి బాగా కలిసొచ్చే విషయం. మొత్తం మీద కార్తికి చాల రోజుల తరువాత తెలుగులో ఖైదీ మంచి చిత్రంగా నిలుస్తోంది,
