మణిరత్నం “పొన్నియన్ సెల్వన్” నుండి కార్తీ లుక్ రిలీజ్…మామూలుగా లేదుగా!

Published on Jul 5, 2022 6:04 pm IST

మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎపిక్ పీరియడ్ డ్రామా పోన్నియన్ సెల్వన్ పై రోజురోజుకీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ చిత్రం కి సంబంధించిన మొదటి పార్ట్ ను సెప్టెంబర్ 30, 2022 న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు విడుదలై ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రం నుండి కార్తీ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. వందియాతేవన్ గా కార్తీ ఈ చిత్రం లో కనిపించనున్నారు. గుర్రం మీద స్వారీ చేస్తూ కనిపించిన ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. కార్తీ ఫ్యాన్స్ మాత్రం ఈ లుక్ పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ చిత్రం లో విక్రమ్, జయం రవి,ఐశ్వర్య బచ్చన్, త్రిష, శోభిత ధూళిపాళ, జయరామ్, ఐశ్వర్య లక్ష్మి, విక్రమ్ ప్రభు, అశ్విన్ కాకుమాను లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మద్రాస్ టాకీస్ మరియు లైకా ప్రొడక్షన్స్ పతాకాల పై మణిరత్నం మరియు అల్లిరజః సుభస్కరన్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏ. ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :