తెలుగు ప్రేక్షకుల ఆదరణను ఎప్పటికీ మరచిపోలేను : కార్తీ
Published on Nov 2, 2016 6:03 pm IST

karthi
తమిళ, తెలుగు భాషల్లో హీరోగా స్టార్ స్టేటస్ సంపాదించుకున్న కార్తీ నటించిన ’కాష్మోరా’ గత శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే. మొదట్నుంచీ ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా, అందుకు తగ్గట్టే ప్రమోషన్స్ కూడా నిర్వహించడంతో మొదటి వారం ఈ సినిమా మంచి కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో రెండో వారం కూడా ‘కాష్మోరా’కు మంచి కలెక్షన్స్ తీసుకురావాలన్న ఆలోచనతో టీమ్ ఎక్కడా తగ్గకుండా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. నేడు కార్తీ హైద్రాబాద్‌లో కాష్మోరా ప్రమోషన్స్‌తో సందడి చేశారు.

ఈ సందర్భంగానే నిర్వహించిన సక్సెస్ మీట్‌లో కార్తీ మాట్లాడుతూ.. తన సినిమాలను తెలుగు ప్రేక్షకులు మొదట్నుంచీ ఎంతగానో ఆదరిస్తున్నారని, తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ ఋణపడి ఉంటానని అన్నారు. ‘ఫస్టాఫ్ ఫర్వాలేదంటూ చూస్తోన్న ప్రేక్షకులు, సెకండాఫ్‌లో వచ్చే భారీ విజువల్స్‌కు ఇట్టే కనెక్ట్ అయిపోతున్నారు. ఈ రోజుకీ కలెక్షన్స్ ఎక్కడా తగ్గకుండా అన్నిచోట్లా మంచి ఆదరణ కనిపిస్తోంద’ని టీమ్ తెలిపింది. గోకుల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను పీవీపీ సినిమా నిర్మించగా కార్తీ సరసన నయనతార, శ్రీదివ్య హీరోయిన్లుగా నటించారు.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook