నిర్మాతలు చేసిన పనికి ఫుల్ ఖుషీ అయిన కార్తి, రకుల్ ప్రీత్ !
Published on Nov 22, 2017 4:36 pm IST

కార్తి, రకుల్ ప్రీత్ సింగ్ లు జంటగా నటించిన ‘ఖాకి’ చిత్రం తెలుగులో విడుదలై మంచి విజయం దిశగా సాగుతున్న సంగతి తెలిసిందే. తమిళ డబ్బింగ్ సినిమా కావడంతో ఓపెనింగ్స్ తక్కువ ఉండటంతో సినిమా బాగున్నా పెద్దగా టాక్ బయటికిరాలేదు. దేనితో సినిమాను తెలుగులో సమర్పించిన ఆదిత్య మ్యూజిక్ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాల్ని నిర్వహించి సినిమాను జనాల్లోకి తీసుకెళ్లగలిగారు.

దాంతో పాజిటివ్ మౌత్ టాక్ ఇంకాస్త పెరిగి ప్రేక్షకాదరణ ఎక్కువైంది. ఇలా ఆదిత్య మ్యూజిక్ వారు సినిమా పట్ల అమితమైన భాద్యతగా ఉంటూ, పక్క ప్రణాళికతో సినిమాను ప్రకారం చేయడం, విజయం దిశగా సినిమాను నడపడంతో హీరో కార్తి, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ లు సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో వారు చేయబోయే ప్రతి సినిమా ఇలాగే సక్సెస్ కావాలని కోరుకున్నారు.

 
Like us on Facebook