ప్రశంసలందుకుంటున్న కార్తి, రకుల్ ల జంట !
Published on Nov 19, 2017 2:54 pm IST

తమిళ హీరో కార్తి నటించిన తాజా చిత్రం ‘తీరన్ అదిగారం ఓండ్రు’ తెలుగులో ‘ఖాకి’ రుతో గతాశుక్రవారం విడుదలైంది. మొదటిరోజే పాజిటివ్ టాక్ రావడంతో శనివారం వసూళ్లు ఊపందుకున్నాయి. ఇందులో యాక్షన్ సన్నివేశాలకు ఎంత రెస్పాన్స్ వస్తుందో కార్తి, రకుల్ ప్రీత్ ల మధ్య నడిచే రోమాంటిక్ ట్రాక్ కు కూడా అంతే స్పందన కనబడుతోంది.

రకుల్ ను ఇదివరకు చూడని పాత్రలో చూశామని, వారిద్దరి జంట స్క్రీన్ మీద చూడ ముచ్చటగా ఉందని ఫ్యామిలీ ఆడియన్స్ ప్రశంసలు గుప్పిస్తున్నారు. దీంతో రకుల్, కార్తిల జంట అటు తమిళం, ఇటు తెలుగులో హిట్ పెయిర్ గా నిలిచింది. హెచ్.వినోత్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని తెలుగులో సుభాష్ గుప్త, ఉమేష్ గుప్తాలు అందించారు. ఈరోజు కూడా ఆదివారం కావడంతో సినిమా కలెక్షన్స్ మరింత బలపడే అవకాశముంది.

 
Like us on Facebook