భారీ ధరకి కార్తీ “జపాన్ “ఓటిటి రైట్స్.!

Published on Jan 10, 2023 9:07 am IST


కోలీవుడ్ సహా తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్న హీరో కార్తీ రీసెంట్ గా “సర్దార్” చిత్రంతో తన కెరీర్ లో మరో సెన్సేషనల్ హిట్ ని అందుకున్నాడు. ఇక ఈ చిత్రం సక్సెస్ తర్వాత మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ని అయితే స్టార్ట్ చేసాడు. ఆ చిత్రమే “జపాన్”. యంగ్ దర్శకుడు రాజు మురుగన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ చేసుకుంటుండగా లేటెస్ట్ గా అయితే ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కుల డీల్ అయితే ముగిసింది.

మరి ఈ చిత్రం ఓటిటి హక్కులు దిగ్గజ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు కొనుగోలు చేశారట. మరి ఇది కార్తీ కెరీర్ లోనే అత్యధిక మొత్తంలో అన్నట్టుగా తెలుస్తుంది. దీనితో ఈ లేటెస్ట్ అప్డేట్ వైరల్ గా మారింది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా నటిస్తుండగా ఎస్ ఆర్ ప్రభు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ ఏడాది లోనే ఈ సినిమా రిలీజ్ ఉండనుంది.

సంబంధిత సమాచారం :