కార్తీ ‘సర్ధార్’ తెలుగు రైట్స్ దక్కించుకున్న ప్రముఖ సంస్థ

Published on Jun 27, 2022 6:02 pm IST

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ ఇటీవల సుల్తాన్ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి దానితో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న గ్రాండియర్ మూవీ పొన్నియన్ సెల్వన్ లో ఒక ముఖ్య పాత్ర చేస్తున్న కార్తీ, మరోవైపు హీరోగా చేస్తున్న మూవీ సర్ధార్. గతంలో విశాల్ తో అభిమన్యుడు వంటి థ్రిల్లింగ్ యాక్షన్ మూవీ తీసిన పి ఎస్ మిత్రన్ దర్శత్వంలో తెరకెక్కుతున్న సర్ధార్ లో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుండగా ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న సర్ధార్ మూవీకి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను టాలీవుడ్ ప్రముఖ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ వారు దక్కించుకున్నారు. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న సర్ధార్ మూవీ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుండగా ఇందులో కార్తీ ద్విపాత్రిభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ అందరినీ ఆకట్టుకుని మూవీపై మంచి అంచనాలు ఏర్పరిచింది. మరి దీపావళికి రానున్న సర్ధార్ ఎంతర మేర సక్సెస్ అందుకుంటాడో చూడాలి.

సంబంధిత సమాచారం :