కార్తీ ‘సర్ధార్’ పది రోజుల కలెక్షన్ ఎంతంటే …?

కార్తీ ‘సర్ధార్’ పది రోజుల కలెక్షన్ ఎంతంటే …?

Published on Nov 1, 2022 3:00 AM IST


యువ నటుడు కార్తీ హీరోగా రాశి ఖన్నా, రజీషా విజయన్ హీరోయిన్స్ గా తెరకెక్కిన లేటెస్ట్ సెన్సేషనల్ హిట్ మూవీ సర్ధార్. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందిన ఈ మూవీని తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ వారు విడుదల చేసారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ మూవీని పీఎస్ మిత్రన్ భారీ యాక్షన్ తో కూడిన స్పై థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ గా అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా అద్భుతంగా తెరకెక్కించారు.

ఇక ఇటు తెలుగు, అటు తమిళ భాషల్లో మంచి టాక్ తో సూపర్ కలెక్షన్ తో దూసుకెళ్తున్న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా పది రోజుల్లో రూ. 85 కోట్ల కలెక్షన్ అందుకుని రూ. 100 కోట్ల దిశగా కొనసాగుతోంది. ఈ మూవీలో కార్తీ డ్యూయల్ రోల్ చేయగా ఇతర పాత్రల్లో లైలా, చుంకి పాండే, మునీష్ కాంత్, యుగి సేతు, అవినాష్, బాలాజీ శక్తివేల్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు