ఇంటర్వ్యూ : హీరో కార్తి – సరికొత్త ప్రెజెంటేషన్‌తో ‘అన్నగారు వస్తారు’ మెప్పిస్తుంది..!

Karthi 1 1

తమిళ హీర కార్తి నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘అన్నగారు వస్తారు’ డిసెంబర్ 12న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది. ఈ సినిమాను దర్శకుడు నలన్ కుమారసామి డైరెక్ట్ చేస్తుండగా స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కె.ఇ.జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్ర విశేషాలను కార్తి మీడియాతో పంచుకున్నారు.

– నేను ఈ సినిమాలో నటించేందుకు కారణం డైరెక్టర్ నలన్ కుమారస్వామి. ఆయన సూదు కవ్వమ్ సినిమాకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి డైరెక్టర్ 8 ఏళ్ల తర్వాత చేస్తున్న చిత్రమిది. సినిమాలు చేయకుంటే వాళ్లను మర్చిపోతాం. కానీ నలన్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. 80వ దశకంలో మాస్ కమర్షియల్ సినిమా మేనియాను మరోసారి గుర్తుచేసేలా ఈ సినిమా ఉంటుంది.

– నా వరకు చెప్పాలంటే ఇది రిస్కీ ప్రయత్నం. నేను ఊపిరి లాంటి మూవీస్ ఈజీగా చేయగలను కానీ అన్నగారు వస్తారు ఒక ఛాలెంజింగ్ ఫిల్మ్. అయితే రైటర్స్ కు స్వేచ్ఛ ఇచ్చినప్పుడే కొత్త తరహా సినిమాలు వస్తాయి. లేకుంటే ఎప్పుడూ ఒకే తరహా మూవీస్ చేయాల్సివస్తుంది. అవేంజర్స్ లాంటి విజువల్స్, మ్యూజిక్ తో ఈ సినిమాను నలన్ కొత్తగా ప్రెజెంట్ చేశాడు. అందుకే అన్నగారు వస్తారు మూవీ చేయడం ఎగ్జైటింగ్ గా ఉంది.

– హీరో, సాంగ్స్, విలన్, ఫైట్స్..ఇలాంటి ఒక స్ట్రక్చర్ ఉన్న సినిమాలు మన దగ్గరే ఉన్నాయి. ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి సినిమాలను చూడం. ఆ పర్పెక్ట్ మాస్ కమర్షయిల్ మూవీస్ 80, 90 దశకాల్లోనే వచ్చాయి. సీరియస్ గా కథ జరుగుతున్నప్పుడు మన సినిమాల్లో ఒక పాట పెడతాం, ఆడియెన్స్ ను రిలాక్స్ చేసి మళ్లీ కథలోకి తీసుకెళ్తాం. అది మన సినిమాకే సాధ్యం. అలాంటి స్ట్రక్చర్ కథతో కొత్త మోడరన్ ప్రెజెంటేషన్ తో ఈ సినిమా ఉంటుంది.

– మీరు ట్రైలర్ లో చూసి ఉంటారు. పారలల్ వరల్డ్ లో జరిగే సూపర్ హీరో సినిమా ఇది. పోలీస్ ఆఫీసర్ గా సఫారీ డ్రెస్ వేసుకుంటాను. ఆ విషయం జడ్జితో చెబుతాను. దర్శకుడు నలన్ చూపించిన కొత్తదనం ఇది. నేను గతంలో సీరియస్, పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్స్ క్యారెక్టర్స్ చేశాను. అన్నగారు వస్తారులో పోలీస్ పాత్ర అయినా దర్శకుడు డిఫరెంట్ గా డిజైన్ చేశారు.

– హీరోయిన్ కృతిశెట్టి ఆకట్టుకునేలా నటించింది. స్పిరిట్ రీడర్ లా ఆమె కనిపిస్తుంది. ఈ పాత్ర కోసం రీసెర్చ్ చేసి, ప్రిపరేషన్ తో పర్‌ఫార్మ్ చేసింది. ఫస్ట్ సీన్ చూసి నేను ఎంత బాగా నటిస్తుంది అనుకున్నా. హీరోయిన్ అంటే కొన్నిసార్లు గ్లామర్ డాల్ లా ఉండాల్సివస్తుంది. కానీ కృతి నటిగా ఎఫర్ట్స్ పెట్టింది. ఆమె డ్యాన్సులు, గ్లామర్ కాకుండా మంచి యాక్టర్ లా పేరు తెచ్చుకోవాలని సిన్సియర్ గా ప్రయత్నిస్తోంది.

– ఎవరు కొత్త తరహా సినిమా చేసినా కనీసం మన వంతు ప్రోత్సాహం అందించాలి. లేకుంటే కొత్తగా ప్రయత్నించేవారు ముందడుగు వేయలేరు. సత్యం సుందరం లాంటి సినిమాను ఒకవేళ ప్రేక్షకులు ఆదరించకుంటే మరోసారి అలాంటి సినిమా చేసే ప్రయత్నమే ఎవరు చేయరు కదా. అఖండ 2 రిలీజ్ కన్ఫమ్ కావడం హ్యాపీగా ఉంది. ఆ సినిమా కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నా.

Exit mobile version