టాలీవుడ్‌లో తెరకెక్కిన ‘హిట్’ ఫ్రాంచైజీ చిత్రాలకు ప్రేక్షకుల నుండి సాలిడ్ రెస్పాన్స్ దక్కింది. ఈ ఫ్రాంచైజీలో ఇప్పటివరకు హిట్, హిట్-2, హిట్-3 చిత్రాలు రిలీజ్ అయ్యాయి. తొలి భాగంలో విశ్వక్ సేన్, రెండో భాగంలో అడివి శేష్, మూడో భాగంలో నాని హీరోలుగా నటించి మెప్పించారు. ఇక ఈ ఫ్రాంచైజీ చిత్రాలను దర్శకుడు శైలేష్ కొలను డైరెక్ట్ చేసి తన ట్యాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు.
ఇప్పుడు హిట్-4 చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు ఆయన రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌పై ఆయన ఫోకస్ పెట్టారు. ఇక ఈ సినిమాలో కార్తీ హీరోగా నటించబోతున్నట్లు మూడో భాగంలోనే తెలిపారు. నాని ‘హిట్-3’ సినిమాలో కార్తీ క్యామియోతో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఇక హిట్-4 కోసం కార్తీ 2027లో బల్క్ డేట్స్ ఇచ్చాడని.. ఈ చిత్ర షూటింగ్ వచ్చే ఏడాది ఆరంభంలో మొదలు పెట్టేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారని తెలుస్తోంది.
మొత్తానికి ‘హిట్-4’ సినిమాను పట్టాలెక్కించేందుకు మేకర్స్ ప్రయత్నిస్తుండటం తో ఈ ఫ్రాంచైజీ చిత్రం కోసం ప్రేక్షకులు అప్పుడే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
