చినబాబుగా అలరించనున్న కార్తీ !

తెలుగులో సైత్మ మంచి ఆదరణను సంపాదించుకున్న తమిల్ హీరోల్లో కార్తీ కూడా ఒకరు. ఆయన సినిమాల కోసం తెలుగు ఆడియన్స్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అందుకే ఆయన తన ప్రతి సినిమాని తమిళంతో పాటు తెలుగులో కూడా డబ్ చేసి ఏకకాలంలో రిలీజ్ చేస్తుంటారు. ఇటీవలే ‘ఖాకీ’ సినిమాతో మెప్పించిన ఆయన త్వరలో ‘చినబాబు’ గా మన ముందుకురానున్నారు.

తమిళంలో రూపొందుతున్న ‘కడైకుట్టి సింగం’ సినిమాను తెలుగులో ‘చినబాబు’ పేరుతొ రిలీజ్ చేయనున్నారు. ఇందులో కార్తీ ఒక రైతు పాత్రలో కనిపించనున్నాడు. యాక్షన్, డ్రామా, రొమాన్స్ కలగలిసిన ఈ విలేజ్ డ్రామాను పాండిరాజ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో కార్తీకి జోడీగా ‘అఖిల్ ‘ ఫేమ్ సాయేషా సైగల్ నటిస్తోంది.