కాస్టింగ్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న యంగ్ డైరెక్టర్ !


గతేడాది తమిళ పరిశ్రమలో ఘన విజయం సొంతం చేసుకున్న సినిమాలో ‘దురువంగల్ పతిన్నారు’ కూడా ఒకటి. ఈ చిత్రం ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుని చిత్ర్ర దర్శకుడు కార్తీక్ నరేన్ కు బోలెడంత క్రేజ్ తెచ్చిపెట్టింది. దీంతో ఆ యువ దర్శకుడు నెక్స్ట్ ఎలాంటి సినిమా చేస్తాడు, ఎవరితో చేస్తాడు అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. ఆ అంచనాలకి తగ్గట్టే ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ నిర్మాణంలో ‘నరగసూరన్’ అనే ప్రాజెక్టుని ప్రకటించిన కార్తిక్ నరేన్ కొద్ది సేపటి క్రితమే చిత్రంలో నటించనున్న నటీనటుల పేర్లను కూడా రివీల్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు.

ఈ కాస్ట్ లిస్ట్ అంతలా సంచలనం అవడానికి కారణం అందులో ప్రముఖ నటుడు అరవింద స్వామి, స్టార్ హీరోయిన్ శ్రియ శరన్ లు నటిస్తుండటమే. పైగా విడుదల చేసిన టైటిల్ లుక్ కూడా థ్రిల్లింగా ఉండటంతో సినిమా పట్ల ఆసక్తి మరింతగా పెరుగుతోంది. ఇకపోతే ఈ చిత్రంలో తెలుగు యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా నటిస్తుండటం మరొక విశేషం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని తెలుగులో ‘నరకాసురుడు’ పేరుతొ రిలీజ్ చేయనున్నారు.