“కార్తీక దీపం” షాకింగ్ ట్విస్ట్స్ తో మళ్ళీ పాత రికార్డులు బద్దలు.?

Published on Aug 17, 2022 1:45 pm IST

మన తెలుగు స్మాల్ స్క్రీన్ దగ్గర పలు షోలకి కానీ సీరియల్స్ కి గాని ఉండే ఆదరణ మొత్తం ఇండియా లోనే ఏ భాషలో కూడా ఉండదని చెప్పాలి. ఆ రేంజ్ లో మన వాళ్ళు ఆదరిస్తారు. మరి ఈ ఎంటర్టైన్మెంట్ లో అయితే పలు ఛానెల్స్ లో సీరియల్స్ కి భారీ స్థాయి రేటింగ్స్ నామౌ అవుతూ ఉంటాయి. ఇక అలనాటి సీరియల్స్ లో అయితే స్టార్ మా ఛానెల్లో ప్రసారం అయ్యే “కార్తీక దీపం” కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని కూడా లేదు.

ప్రస్తుతం ఇంట్లో ఆడవాళ్ళతో పాటు వారి కుటుంబం కూడా ఈ ధారావాహికను ఆసక్తిగా చూస్తున్నారు. అయితే లేటెస్ట్ గా మాత్రం వారు చూపిస్తున్న కొత్త ప్రోమోలు ఒక్కసారిగా ఆడియెన్స్ లో షాకింగ్ గా మారాయి. అసలు ఈ సీరియల్ మెయిన్ పాత్రలే కార్తీక్, దీప లను పక్కన పెట్టేసి కొత్త స్టోరీ కి కట్ చేసిన మేకర్స్ ఆడియెన్స్ నుంచి కాస్త నెగిటివ్ ఫీడ్ బ్యాక్ నే అందుకున్నారు.

దీనితో మళ్ళీ ఈ ఇద్దరి పాత్రలని వెనక్కి తీసుకొస్తున్నట్టుగా చూపిస్తున్న లేటెస్ట్ ప్రోమోలు ఒక్కసారిగా ఆసక్తి రేపుతున్నాయి. ఇప్పటికే ఈ సీరియల్ ఇండియన్ టెలివిజన్ హిస్టరీ లో అత్యధిక రేటింగ్ తో నడుస్తుంది. ఇక ఈ ఇద్దరూ కనిపించే ఎపిసోడ్ అయితే డెఫినెట్ గా రికార్డు బ్రేకర్ గా ఉంటుందని చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం :