వినూత్నమైన పాయింట్ తో ‘కార్తికేయ’లాంటి మంచి సినిమాతో తెలుగు తెరకు దర్శకుడుగా పరిచయం అయ్యాడు చందు మొండేటి. ‘కార్తికేయ’ హిట్ తో చందు మొండేటికి చాలా ఆఫర్స్ వచ్చాయి. కొంతమంది హీరోలు సైతం చందుతో వరుసగా సినిమాలు చెయ్యడానికి చాలా ఆసక్తి చూపించారు. ఆలా చేసిందే ‘సవ్యసాచి’ సినిమా. నవంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫిస్ వద్ద అపజయాన్ని మూట్టకట్టుకుంది.
దాంతో చందు మొండేటి నాగార్జునతో అనుకున్న ప్రాజెక్ట్ కూడా ఆగిపోయింది.అలాగే ‘శర్వానంద్’తోనూ అప్పట్లో ఓ సినిమా చేద్దామనుకున్నారు.అది వర్కౌట్ అవ్వలేదు. దాంతో చందు తన తరువాత సినిమాను నిఖిల్ తో చేస్తోన్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం ‘కార్తికేయ 2’ స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నాడు చందు. అయితే ‘కార్తికేయ 2’ స్క్రిప్ట్ ను కూడా వినూత్నమైన పాయింట్ తోనే రాస్తున్నాడట. ‘కార్తికేయ’ తీసి మంచి డిమాండ్ ను తెచ్చుకున్న చందు.. మళ్ళీ ‘కార్తికేయ 2’తో మళ్ళీ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.
