నిఖిల్ సిద్ధార్థ “కార్తికేయ 2” డిజిటల్ స్ట్రీమింగ్ పార్ట్ నర్ ఫిక్స్!

Published on Apr 11, 2022 7:07 pm IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న చిత్రం కార్తికేయ 2. తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ, చిత్ర యూనిట్ సరికొత్త పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రం ను జూలై 22, 2022 న థియేటర్ల లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

అయితే ఈ చిత్రం పోస్టర్ ను పరిశీలిస్తే, థియేటర్ల లో విడుదల అయిన తర్వాత జీ 5 లో డిజిటల్ ప్రీమియర్ గా రానున్నట్లు తెలుస్తోంది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :