లేటెస్ట్ : ‘కార్తికేయ – 2’ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా…?

Published on Sep 21, 2022 12:09 am IST


యువ నటుడు నిఖిల్ సిద్దార్ధ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ కార్తికేయ 2. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ ఇటీవల రిలీజ్ తరువాత తెలుగు తోపాటు హిందీ లో కూడా అదిరిపోయే రేంజ్ లో కలెక్షన్ ని సొంతం చేసుకుంది. అటు యుఎస్ఏ లో సైతం భారీ స్థాయిలో కలెక్షన్ అందుకున్న కార్తికేయ ఇంకా కొన్ని ప్రాంతాల్లో బాగానే కొనసాగుతోంది.

థ్రిల్లింగ్ యాక్షన్ అడ్వెంచరస్ ఎంటర్టైనర్ గా భారతీయ సనాతన ధర్మం, శ్రీకృష్ణుని జీవితానికి సంబందించిన ఒక కీలక అంశం తో అద్భుతంగా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన ఈ సినిమాకి ప్రేక్షకులకు నీరాజనాలు పలకడంతో యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఓటిటి లో ఈ మూవీ కోసం అందరూ ఎదురు చూస్తుండగా లేటెస్ట్ టాలీవుడ్ అప్ డేట్ ప్రకారం ఈ మూవీ ప్రముఖ ఓటిటి మాధ్యమం జీ 5 లో అక్టోబర్ 7 నుండి ప్రసారం కానుందని, అలానే అతి త్వరలో దీనిపై కార్తికేయ 2 టీమ్ నుండి అఫీషియల్ గా ప్రకటన కూడా రానుందని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :